ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా...?

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీసును ఊపేస్తోంది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భారీ టెక్నికల్ వండర్ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టింది. తెలుగు సినిమా సత్తాను చాటేలా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళుతోంది. 

కల్కి.. చిత్రం తొలి ఆట నుంచే అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ స్టామినాను చాటేలా ఉండడంతో ఈ సినిమాకు ఫ్యాన్స్ పోటెత్తారు. దానికితోడు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణేల పెర్ఫార్మెన్స్ కూడా సినిమాలో ఈలలు వేయించేలా ఉంది. మహాభారత గాథను లింక్ చేసి రూపొందించుకున్న కథతో నాగ్ అశ్విన్ వెండితెరపై చేసిన మ్యాజిక్ కు సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడుతున్నారు. 

వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను 8 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ప్రతి చోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రూ.100 కోట్లు వచ్చాయి. ఎక్కడా నెగెటివ్ రివ్యూలు లేకపోవడంతో, ఈ వారం ముగిసేసరికి పలు బాక్సాఫీసు రికార్డులను కల్కి 2898 ఏడీ అధిగమించే అవకాశం ఉంది.

Kalki 2898 AD
Prabhas
Opening Day
Collections
Nad Aswin
Vyjayanthi Movies

More Telugu News